Online Puja Services

కైలాస హిమగిరి శంకరా పాట

18.222.239.77

కైలాస హిమగిరి శంకరా పాట | Kailasa Himagiri Shankara Song | Lyrics in Telugu 

 

ఓ ఓ ఓ ఓ, ఓ ఓ ఓ ఓ కైలాస హిమగిరి శంకరా... ,
 కనికారముంచరా...
మనసార మోము చూపించరా..   

ఓ ఓ ఓ ఓ, ఓ ఓ ఓ ఓ కైలాస హిమగిరి శంకరా... ,
 కనికారముంచరా...
మనసార మోము చూపించరా.. 

నీలకంఠ నిను చూడగోరి, నిరతము నిన్ను సేవించెద
నీలకంఠ నిను చూడగోరి, నిరతము నిన్ను సేవించెద
జగములేలే ఓ దేవదేవ, జ్యోతులివిగో నన్నేలరా
 కనికారముంచరా...
మనసార మోము చూపించరా..

ఓ ఓ ఓ ఓ, ఓ ఓ ఓ ఓ కైలాస హిమగిరి శంకరా... ,
 కనికారముంచరా...
మనసార మోము చూపించరా..   

మనసు నిలిపిన మహనీయులందరు జన్మ సద్గతి కావించిరి
మనసు నిలిపిన మహనీయులందరు జన్మ సద్గతి కావించిరి
కానరాని కలి మాయ లోన, వెలుగు చూపి దరి చేర్చరా
 కనికారముంచరా...
మనసార మోము చూపించరా..   

ఓ ఓ ఓ ఓ, ఓ ఓ ఓ ఓ కైలాస హిమగిరి శంకరా... ,
 కనికారముంచరా...
మనసార మోము చూపించరా.. 

చంద్ర మౌళీ జిత భస్మ ధారి 
చంద్ర కాంతుల  తేజో  విహారి
దండ మయ్యా  ఓ లింగ ధారి
నిన్ను గొలిచె చర్మంబరా
 కనికారముంచరా...
మనసార మోము చూపించరా..     

ఓ ఓ ఓ ఓ, ఓ ఓ ఓ ఓ కైలాస హిమగిరి శంకరా... ,
 కనికారముంచరా...
మనసార మోము చూపించరా.. 

 

Kailasa, Himagiri, Shankara, Sankara, Song, devotional, songs, shiva, siva, 

Quote of the day

Do not be very upright in your dealings for you would see by going to the forest that straight trees are cut down while crooked ones are left standing.…

__________Chanakya